Raashi Khanna : పాత్ర కోసం కఠోర శ్రమ.. గాయాలతో రాశీ ఖన్నా!

Raashi Khanna : పాత్ర కోసం కఠోర శ్రమ.. గాయాలతో రాశీ ఖన్నా!

click here for more news about Raashi Khanna

Reporter: Divya Vani | localandhra.news

Raashi Khanna తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న Raashi Khanna ప్రస్తుతం ఆమె తాజా చిత్రానికి శారీరకంగా,మానసికంగా కఠినంగా శ్రమిస్తున్నారు.సాధారణ పాత్రలు కాదు,ఈసారి ఆమె చేస్తున్న పాత్ర మాత్రం వేరేలా ఉంది–ఆమెను గాయాలతో పాటు,ప్రేక్షకుల గుండెల్లో నిలిచేలా చేస్తోంది.సోమవారం ఆమె ఇన్‌స్టాగ్రామ్లో కొన్ని చిత్రాలను షేర్ చేశారు.ఈ ఫోటోలలో రాశీ ముఖం మీద,చేతులపై గాయాలు కనిపించాయి.ముక్కుపైన రక్తపు మరకలు,చిరిగిన చొక్కా,ఆమె వేసుకున్న లుక్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Raashi Khanna : పాత్ర కోసం కఠోర శ్రమ.. గాయాలతో రాశీ ఖన్నా!
Raashi Khanna : పాత్ర కోసం కఠోర శ్రమ.. గాయాలతో రాశీ ఖన్నా!

“కొన్ని పాత్రలు అడగవు.అవి డిమాండ్ చేస్తాయి.
మీ శరీరం, శ్వాస, గాయాలు.అన్నీ కావాలి.
మీరు తుఫానుగా మారినప్పుడు, ఉరుములు భయపెట్టవు.
తర్వాతి చిత్రం త్వరలో రాబోతోంది.

అని క్యాప్షన్‌తో ఆమె పోస్ట్ చేశారు.ఈ ఫోటోలు అర్థరాత్రి షేర్ చేసినా, కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి.రాశీ అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారో ఊహించలేక గుబురుకుంటున్నారు.చాలామంది కామెంట్స్‌లో “ఇంత ఇంటెన్స్‌ లుక్‌ ఎప్పుడు చూసామో గుర్తు లేదు”,”ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నాం”, అంటూ రాశీకి మద్దతు తెలిపారు.ఈ ప్రాజెక్ట్ కోసం రాశీ ఖన్నా భారీ శారీరక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.ఆమె కొన్ని స్టంట్స్‌ కూడా స్వయంగా చేస్తున్నారు.బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఫిట్‌నెస్ ట్రైనింగ్, ఫైట్ ప్రాక్టీస్ – ఇవన్నీ ఆమె రూటీన్‌లో భాగమే.ఒక నటిగా తన పాత్రకు న్యాయం చేయడానికై ఆమె చేస్తున్న కృషి స్పష్టంగా కనిపిస్తోంది.

రాశీ చివరిసారి కనిపించిన చిత్రం “ది సబర్మతి రిపోర్ట్”.ఇది గోద్రా రైలు ఘటన ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా. ఇందులో ఆమె ఒక జర్నలిస్టు పాత్ర పోషించారు.ఆమెతో పాటు విక్రాంత్ మాస్సే, రిద్ధి డోగ్రా ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా క్రిటిక్స్‌ నుండి మంచి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం Raashi Khanna తెలుగులో “తెలుసు కదా” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమెకు జోడీగా సిద్దు జొన్నలగడ్డ ఉన్నారు.ఇది ఒక ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.అలాగే బాలీవుడ్‌లో రాశీ “TME” అనే యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నారు.ఇది ఆమెకు హిందీలో మరో బలమైన పాత్రను అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.అంతేకాదు, రాశీ ఫర్జీ వెబ్ సిరీస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు “ఫర్జీ 2″లోనూ నటిస్తున్నారు. మొదటి సీజన్‌లో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది.

ఇప్పుడు రెండో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ కూడా యాక్షన్‌, థ్రిల్లింగ్‌తో నిండిన కథతో ఉండనుంది.రాశీ ఖన్నా కెరీర్‌ను చూస్తే ఆమె ఎప్పుడూ కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు మాత్రమే ఎంచుకుంటున్నారు. గ్లామర్‌ కంటే పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే నటిగా ఆమె ఎదుగుతున్నారు.ప్రేక్షకుల అంచనాలను మించి నటనను అందించడంలో ఆమె ముందుండే నటీమణులలో ఒకరు.ఈసారి ఆమె పోస్ట్‌ చూసి చాలా మంది యువ నటులు స్ఫూర్తి పొందుతున్నారు.”ఒక పాత్ర కోసం ఇలా శ్రమించాలా?” అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఫిజికల్ స్టంట్స్‌, గాయాలతో కూడిన సన్నివేశాలు, అవన్నీ నటులకి సవాలుగా ఉంటాయి.

కానీ రాశీ ఖన్నా మాత్రం ఏ చిన్న భయం లేకుండా ముందుకు వెళ్తున్నారు.ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌ కూడా ఆమె సినిమాల పట్ల ఉన్న దృఢతను, అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.ప్రతి పోస్ట్‌కి చాలా భావోద్వేగం కలిపి ఉంటుంది.సినిమాలపై ఆమె ప్రేమ, నటనపై కమిట్‌మెంట్‌ స్పష్టంగా కనిపిస్తాయి.రాశీ ఖన్నా ప్రస్తుతం చేస్తున్న పాత్రతో కేవలం స్క్రీన్ మీదే కాదు, ఆమె అభిమానుల హృదయాల్లో కూడా గాఢంగా నిలవబోతున్నారు.గాయాలతో కూడిన ఈ పాత్ర, ఆమె నటనకు మరొక మైలురాయిగా మారే అవకాశం ఉంది.త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా, ఆమెకు మరో గుర్తింపు ఇవ్వడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *