Operation Sindhoor : ‘ఆపరేషన్ సిందూర్’..50-80 మంది ఉగ్రవాదులు హతం

Operation Sindhoor : ‘ఆపరేషన్ సిందూర్’..50-80 మంది ఉగ్రవాదులు హతం

click here for more news about Operation Sindhoor

Reporter: Divya Vani | localandhra.news

Operation Sindhoor జమ్మూకశ్మీర్‌లో ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి భారత్ గట్టి బదులిచ్చింది. బుధవారం తెల్లవారుజామున, భారత సాయుధ దళాలు పాక్-పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపాయి.ఈ దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరుపెట్టారు. ఇందులో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో సరిహద్దుల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.భారత దళాలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. మొత్తం తొమ్మిది శిబిరాలపై అద్భుతంగా సమన్వయపూర్వకంగా దాడులు చేశారు.ఈ దాడులు పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి ప్రతీకారంగా జరిగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బహవల్పూర్, మురిడ్కే ప్రాంతాల్లో అత్యధిక నష్టం జరిగింది.మురిడ్కేలోని మసీద్ వా మర్కజ్ తైబా, లష్కరే కేంద్రంగా పనిచేసింది. ఇక్కడ 25-30 మంది ఉగ్రవాదులు హతమైనట్టు అంచనా. మిగతా స్థావరాలపై సమాచారం ఇంకా రావాల్సిఉంది ఉంది.ఈ దాడుల్లో లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణ కేంద్రాలు, రిక్రూట్మెంట్ క్యాంప్‌లు ధ్వంసమయ్యాయి. ఇవన్నీ జైషే, లష్కరే వంటి నిషేధిత సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నవే.భారత సైన్యం ‘ఎక్స్’లో వీడియోను పోస్ట్ చేస్తూ, ‘న్యాయం జరిగిందని’ ప్రకటించింది. మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఈ దాడులను ‘యుద్ధానికి సమానం’ అంటూ ఖండించింది.పాక్ వర్గాల ప్రకారం, ఈ దాడుల్లో 8 మంది పౌరులు, ఒక చిన్నారి చనిపోయారని ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వం పాక్ సైన్యం లక్ష్యం కాదని స్పష్టంగా తెలిపింది.

లక్ష్యంగా మారిన కొన్ని ప్రధాన స్థావరాల్లో:
జైషేకు చెందిన సర్జల్, మర్కజ్ అబ్బాస్, బిలాల్ క్యాంప్
లష్కరే క్యాంప్‌లు మర్కజ్ అహ్లే హదీస్, శ్వవాయ్ నల్లా
హిజ్బుల్ శిక్షణ కేంద్రాలు రహీల్ షాహిద్, మెహమూనా జోయా

మొత్తం తొమ్మిది శిబిరాల్లో, నాలుగు పాక్ లోపల, ఐదు పీవోకేలో ఉన్నాయి.పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని భారత్ స్పష్టం చేసింది.అయితే, పాక్ సైన్యం, ISI, ఎస్‌ఎస్‌జీ వర్గాలు ఈ శిబిరాలకు సహాయం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.దాడుల అనంతరం, పాక్ సైన్యం ఎల్‌వోసీ వద్ద కాల్పులకు తెగబడింది.ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.భారత భద్రతా బలగాలు కూడా దిటుగా ప్రతిస్పందించాయి. తాజా సమాచారం ప్రకారం, సరిహద్దుల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *