latest telugu news Trump : ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

latest telugu news Trump : ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన
Spread the love

click here for more news about latest telugu news Trump

Reporter: Divya Vani | localandhra.news

latest telugu news Trump రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చలు మునుపెన్నడూ లేనంతగా పురోగమించాయని, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. (latest telugu news Trump) ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.”మేం చాలా బాగా చర్చించుకున్నాం. దాదాపు అన్ని అంశాలపై మాట్లాడుకున్నాం. ఇరు పక్షాలు శాంతికి ఎంతో దగ్గరగా ఉన్నాయి. యుద్ధం ముగియాలని అందరూ కోరుకుంటున్నారు” అని ట్రంప్ విలేకరులకు తెలిపారు. జెలెన్ స్కీతో సమావేశానికి ముందు, తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా ట్రంప్ ఫోన్‌లో మాట్లాడటం గమనార్హం.(latest telugu news Trump)

ప్రస్తుతం తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో యుద్ధాన్ని ఉన్న సరిహద్దుల వద్ద నిలిపివేసి, అక్కడ సైనిక రహిత జోన్‌ను ఏర్పాటు చేయాలన్నది తాజా ప్రణాళిక. అయితే, డాన్‌బాస్ ప్రాంత భవిష్యత్తుపైనే ప్రధానంగా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఇది చాలా కఠినమైన సమస్య అయినా, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ప్రణాళికకు 90 శాతం అంగీకారం కుదిరిందని జెలెన్ స్కీ తెలిపారు. భూభాగాల విషయంలో ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయం మేరకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు.

అయితే, ఈ చర్చలపై రష్యా మాత్రం భిన్నంగా స్పందించింది. డాన్‌బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వెంటనే వైదొలగాలని డిమాండ్ చేసింది. శాంతికి యూరప్ దేశాలే అడ్డంకిగా ఉన్నాయని ఆరోపించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారం కాకపోతే, సైనిక చర్య ద్వారానే ముందుకు వెళ‌తామ‌ని పుతిన్ ఇటీవల హెచ్చరించారు. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, రష్యా కఠిన వైఖరి కారణంగా శాంతి ఒప్పందం ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది రాబోయే కొద్ది వారాల్లో తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *