click here for more news about latest telugu news Deepu Chandra Das
Reporter: Divya Vani | localandhra.news
latest telugu news Deepu Chandra Das బంగ్లాదేశ్‌లో మత అసహనం మరోసారి ప్రాణాలను బలితీసుకుంది. మైమన్‌సింగ్ జిల్లాలోని భలుకా పట్టణంలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను ఉన్మాద మూక దారుణంగా హత్య చేసిన ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. (latest telugu news Deepu Chandra Das) ఈ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. తోటి ఉద్యోగులే అతడిని కాపాడకుండా, బహిరంగంగా ఉన్మాదుల చేతికి అప్పగించి దాడిలో పాలుపంచుకున్నారని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.దీపు చంద్ర దాస్ (27) స్థానికంగా ఉన్న ‘పయనీర్ నిట్‌వేర్స్’ అనే వస్త్ర తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా ఉద్రిక్తత చెలరేగింది. దీపు మతపరమైన వ్యాఖ్యలు చేశాడని కొందరు అతివాదులు ఆరోపించారు. ఆ వార్త క్షణాల్లోనే వైరల్ అయి, వందలాది మంది అతడిపై దాడి చేయడానికి ఫ్యాక్టరీ బయట గుమికూడారు. అయితే దర్యాప్తు ప్రకారం, ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు.(latest telugu news Deepu Chandra Das)

పోలీసుల వివరాల ప్రకారం, ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు అతడిని రక్షించడానికి బదులు ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. (latest telugu news Deepu Chandra Das) తర్వాత రక్షణ కల్పించకుండా, బయట వేచి ఉన్న మత ఉన్మాదుల గుంపుకు అప్పగించారు. రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) నివేదికలో, “ఫ్యాక్టరీ యాజమాన్యం తమ సంస్థను రక్షించుకోవడానికి ఒక నిరపరాధిని బలి ఇచ్చింది” అని స్పష్టం చేసింది.ఉన్మాద గుంపు దీపుపై అత్యంత దారుణంగా దాడి చేసింది. అతడిని కర్రలతో, ఇనుపరాడ్లతో కొట్టి చంపి, తర్వాత మృతదేహాన్ని ఢాకా–మైమన్‌సింగ్ హైవేపై వేలాడదీసి నిప్పు పెట్టారు. ఆ దృశ్యం చూసినవారికి కన్నీళ్లు ఆగలేదు. అక్కడే దీపుతో కలిసి పనిచేసే కొందరు సహోద్యోగులు కూడా దాడిలో పాల్గొనడం మరింత కలవరపరిచే విషయం.(latest telugu news Deepu Chandra Das)
దర్యాప్తు సంస్థలు ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగిందని చెబుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకే గొడవ ప్రారంభమైనా, ఫ్యాక్టరీ అధికారులు రాత్రి ఎనిమిది గంటల వరకూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఇండస్ట్రియల్ పోలీస్ సూపరింటెండెంట్ ఫర్హాద్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. “సమాచారం ముందుగానే ఇచ్చి ఉంటే దీపు ప్రాణాలు రక్షించగలిగేవాళ్లం” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.దీపు మత విద్వేష వ్యాఖ్యలు చేశాడని చెప్పిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో కూడా అతడు ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. ఇప్పటివరకు ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు, మరికొందరు ఉన్మాద దాడిలో పాల్గొన్న కార్మికులు ఉన్నారు.
దీపు మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అతనికి ఒకటిన్నర సంవత్సరాల చిన్నారి ఉంది. కుటుంబం ఇప్పుడు పూర్తిగా మానసికంగా కుంగిపోయింది. దీపుని తమ్ముడు అపు చంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ, “నా అన్నను తప్పుడు ఆరోపణలతో చంపేశారు. అతడు ఎవరికీ హాని చేయలేదు. మాకు న్యాయం కావాలి” అని కన్నీటి పర్యంతమయ్యాడు.బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి తర్వాత హిందువులపై దాడులు, ఆస్తుల దోపిడీలు, భారత వ్యతిరేక నిరసనలు పెరిగినట్టు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. గత మూడునెలల్లో కనీసం 15 హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇంతలో ఈ ఘటన జరగడం, అక్కడి పరిస్థితులు ఎంత తీవ్రమైపోయాయో చూపిస్తుంది.
స్థానిక మీడియా కథనం ప్రకారం, ఈ ఘటన తర్వాత మైమన్‌సింగ్ పట్టణం మొత్తం భయాందోళనలో మునిగిపోయింది. పోలీస్ బలగాలు భారీగా మోహరించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత హైకమిషన్ ఢాకాలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నిరసన పత్రం అందజేసింది.హిందూ మైనారిటీ సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. “బంగ్లాదేశ్‌లో హిందువులు సురక్షితం కాదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అంటూ ‘హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్’ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీపు చంద్ర దాస్ హత్య బంగ్లాదేశ్‌లోని మత మైనారిటీల భద్రతపై కొత్త చర్చకు దారితీసింది. కేవలం ఒక తప్పుడు వదంతి, ఒక నిరాధార ఆరోపణ ఎలా ఒక కుటుంబాన్ని ధ్వంసం చేసిందో ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. భద్రతా వ్యవస్థల వైఫల్యం, మానవత్వం లేని సమాజపు దారుణ రూపం ప్రపంచం మొత్తానికి మరోసారి చూపించబడింది.ఇప్పుడు దీపు కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. కానీ, బంగ్లాదేశ్‌లో గత ఘటనల చరిత్ర చూస్తే, వారికి ఆ న్యాయం ఎప్పటికీ దొరుకుతుందా అన్నది సందేహంగానే ఉంది.
