click here for more news about Donald Trump
Reporter: Divya Vani | localandhra.news
Donald Trump బైడెన్ క్యాన్సర్ తీవ్రతను గ్లీసన్ స్కోరింగ్ విధానంలో పరీక్షించారు.అందులో ఆయన స్కోరు 9గా నిర్ధారణ అయిందట.ఇది కాస్త గంభీర స్థాయిలోని క్యాన్సర్‌కు సంకేతం.అంటే వ్యాధి వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.ఈ స్కోరు సాధారణంగా ఒకటికి తొమ్మిదివరకు ఉంటుంది. స్కోరు ఎక్కువైతే, వ్యాధి ఉధృతి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.స్కోరు 9 అంటే ఇది చిన్న విషయం కాదు.ఈ పరిణామాలపై అధ్యక్షుడు (Donald Trump) స్పందించారు.ఆయన షాక్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. “ఇన్ని రోజులు బైడెన్ ఆరోగ్యం గురించి దాచిపెట్టారంటే.ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు.ఇది దేశ భద్రతకు సంబంధించిందిగా” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.గతంలో ఇదే డాక్టర్ బైడెన్ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు అన్నాడు.ఇప్పుడు మాత్రం తీవ్ర క్యాన్సర్ ఉందని చెబుతున్నారు.

ఇది ఎంతవరకు నిజం? ఎప్పుడు మొదలైంది? ప్రజలకు వాస్తవాలు తెలుసు కావాలి.”ట్రంప్ వ్యాఖ్యల్ని చూస్తే, ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం గుప్తంగా ఉంచడాన్ని ఆయన పెద్ద సమస్యగా అభివర్ణించారు. “ఈ రహస్యాలు వదిలేయడమేనా నాయకత్వం?” అని ప్రశ్నించారు.బైడెన్ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, దేశ పరిపాలనపై ప్రభావం పడుతుందన్నది ట్రంప్ బలమైన వాదన.ఇదే కారణంగా ఆయన మరింత స్పష్టత కోరుతున్నారు.ఇంకో వైపు, ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నోరు జారారు.జో బైడెన్ భార్య జిల్ బైడెన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“డాక్టర్ అని పిలుచుకుంటున్న జిల్, కనీసం భర్తలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించలేకపోయిందంటే, ఆమె అసలైన వైద్యురాలేనా?” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.ఆమెను “Fake Doctor”గా పిలిచిన ట్రంప్ జూనియర్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం గురించి సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంపై ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. ఓ దేశాధినేత అనారోగ్యం బారిన పడితే, అందుకు గల కారణాలు, పరిణామాలపై పూర్తి స్పష్టత ఉండాల్సిందే.
అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయడమేనా సరైన దారి? అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. బైడెన్ సానుభూతిపూరితంగా చూసే వాళ్లు, ట్రంప్ విమర్శలు వ్యక్తిగత దాడిగా భావిస్తున్నారు.ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి పూర్తి స్థాయిలో స్పందన రాలేదు.ఆఫిషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా బైడెన్ ఆరోగ్యంపై కొన్ని వివరాలు మాత్రమే అందించబడినాయి.కానీ ట్రంప్ వ్యాఖ్యలతో ఈ విషయమై ప్రభుత్వ స్పందన అవసరమైందని పౌరులు భావిస్తున్నారు.ప్రధాన నాయకుడు అనారోగ్యంతో బాధపడుతుంటే, ప్రజలకు సమాచారం ఇవ్వడం అనేది అవసరం.అది ప్రజాస్వామ్యంలో ఒక బేసిక్ హక్కు అనే వాదనలు ఊపందుకున్నాయి.గతంలో కూడా పలువురు ప్రముఖ నాయకుల ఆరోగ్య సమాచారం గోప్యంగా ఉంచిన సందర్భాలు ఉన్నాయి.
కానీ వాటిపై వ్యతిరేకత ఎక్కువగా వచ్చి, నైతికంగా తప్పు అన్న తీర్పు వచ్చింది.ఈ ఆరోగ్య అంశం పబ్లిక్ లోకి వచ్చిన నేపథ్యంలో, ట్రంప్ శిబిరం దానిని పూర్తిగా తమకి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు, బైడెన్ శిబిరం దీనిని వ్యక్తిగత దాడిగా, తక్కువ స్థాయి రాజకీయంగా ముద్ర వేస్తోంది.ఇది ఎవరి పద్ధతైనా సరే – అమెరికా ప్రజల అభిప్రాయం మాత్రం ఫైనల్.వారు ఆచితూచి ఆలోచిస్తారు.ఈ ఆరోగ్య అంశం 2024 ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? చూడాలి మరి.