click here for more news about Donald Trump
Reporter: Divya Vani | localandhra.news
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జోహ్రాన్ మమ్దానీపై ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికన్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ట్రంప్, మమ్దానీని అక్రమ వలసదారుడిగా చిత్రిస్తూ, ఆయనను అరెస్ట్ చేసి, పౌరసత్వం నుంచి తొలగించి, నిర్బంధ శిబిరానికి తరలించి దేశం నుంచి తుడిచేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఫ్లోరిడాలో మంగళవారం నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ, “అతడు అమెరికాలో చట్టబద్ధంగా ఉన్నాడో లేదో అనేకమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ పరిశీలిస్తాం. అతడు కామ్యూనిస్ట్ మాత్రమే కాకుండా, ఇంకేదైనా తక్కువదైనా అయితే బాగుంటుంది,” అని అన్నారు. మమ్దానీ అక్రమంగా దేశంలో ఉన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యలు న్యాయసంబంధిత ఆధారాలు లేకుండా చేసినవే కావడం గమనార్హం.ట్రంప్ తన పాలనలో ఉంటే మమ్దానీ ఎన్నికల హామీలను అమలు చేయడానికి ప్రయత్నించినట్లయితే వెంటనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.(Donald Trump)

ముఖ్యంగా ఐసీఈ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్) అధికారులపై చర్యలు తీసుకుంటే శిక్షితుడవుతాడని హెచ్చరించారు. ఇది అభ్యర్థుల స్వేచ్ఛను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు విశ్లేషకులు.ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగా స్పందించారు. ఆయన ‘ఎక్స్’ (ఇప్పటి ట్విటర్) వేదికగా స్పందిస్తూ, “ఒక అమెరికన్ పౌరుడిని దేశం నుంచి బయటకు తరలిస్తామని దేశాధ్యక్షుడు బెదిరించడం, ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడి. ఇది నాపై మాత్రమే కాకుండా, న్యూయార్క్ నగరంలో దాగుండకుండా బతకాలనుకునే ప్రతి ఒక్కరిపై పరోక్ష హెచ్చరిక,” అని పేర్కొన్నారు.”నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు. కానీ, నేను ఐసీఈ సంస్థ ప్రజలను వేధించకుండా నిలబడి పోరాడతానని చెప్పినందుకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది న్యాయాన్ని కోరుతున్నవారిపై బెదిరింపుగా ఉంది,” అని మమ్దానీ ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలలో, ప్రస్తుతం న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను కూడా ప్రశంసించారు.
దీనిపై మమ్దానీ తీవ్రంగా స్పందిస్తూ, “ట్రంప్ నియంతృత్వ ధోరణిలో ఎరిక్ ఆడమ్స్‌ను పొగిడడమే అతని పాలనకు నిజమైన నిదర్శనం. న్యూయార్క్ మేయర్ ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమవుతూ, ట్రంప్ విధానాలను అనుసరిస్తున్నారు. ఇది నగర ప్రజల భవిష్యత్‌కు ప్రమాదకరమైన సంకేతం,” అని విమర్శించారు.మమ్దానీ మాట్లాడుతూ, “ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేది లేదు. మా నగరం మత, జాతి, వర్గాల మధ్య ఐక్యతను మేము కాపాడుతాం. న్యాయ వ్యవస్థను ధ్వంసం చేయాలనే ప్రయత్నాల్ని తిప్పికొడతాం. ప్రజాస్వామ్యం అనేది ఎవరైనా తమ స్వరాన్ని వినిపించగల సామర్థ్యం కలిగిన వేదిక.
దానిని నాశనం చేయాలనుకునే ప్రయత్నాలు ఓటమిపాలవుతాయి,” అని స్పష్టం చేశారు.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు అయితే, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి న్యూయార్క్‌లో ముస్లిం ఓట్లను ప్రభావితం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.మమ్దానీ పౌరసత్వంపై అనుమానాలు తలెత్తించడం ద్వారా అతని మేనిఫెస్టోపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలనే కుట్రగా విశ్లేషిస్తున్నారు.మమ్దానీ అమెరికా పౌరుడే కాదు, 2020లో అసెంబ్లీకి గెలిచి, బ్రాంక్స్ ప్రాంత ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ప్రతినిధి కూడా.అతని పౌరసత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ట్రంప్ అన్యాయ రాజకీయాల పట్ల తన చెల్లుబాటు లేని అసహనాన్ని బయటపెడుతున్నారని మమ్దానీ అనుచరులు అభిప్రాయపడుతున్నారు.సాధారణ వలసదారుల హక్కుల కోసం గళమెత్తిన మమ్దానీ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో శక్తివంతమైన యువ నేతగా ఎదుగుతున్నారు. ట్రంప్ వంటి పెద్ద నేతల నుంచి ఎదురుదెబ్బలు ఎదురైనా, నమ్మకంతో ముందుకుసాగుతున్న మమ్దానీకి యువత, వలసదారుల వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చట్టబద్ధతను దాటి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంగా మమ్దానీ చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడం, న్యాయవ్యవస్థను బలహీనపర్చడం అన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమే. ఈ నేపథ్యంలో మమ్దానీ పోరాటం అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త మార్గాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.