USA jobs : అమెరికాలో చదువు తర్వాత ఉద్యోగంలో చేదు అనుభవాలు

USA jobs : అమెరికాలో చదువు తర్వాత ఉద్యోగంలో చేదు అనుభవాలు

click here for more news about USA jobs

Reporter: Divya Vani | localandhra.news

USA jobs అమెరికాలో ఉన్నత విద్యార్థులకు వీసా రావడమే ఒక కల నెరవేరినట్లుగా ఉంటుంది. గౌరవ్ చింతమనీడి కూడా అదే భావనతో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం చేసి, ఆనందంగా జీవితం గడుపుతానన్న ఆశలతో ముందుకు నడిచాడు. కానీ గౌరవ్‌కు ఎదురైన వాస్తవం ఊహించనిది. కాలేజీ పూర్తయిన కొత్తలోనే తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.చాప్‌మన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన గౌరవ్, కొత్త నగరానికి వెళ్లాల్సి వచ్చింది. దేశంలోని సగం దూరం ప్రయాణించి కొత్త జీవితం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఇది తన జీవితంలోనే అతిపెద్ద సవాల్‌గా మారిందని అతను పేర్కొన్నాడు.ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పనిఇస్తే సరిపోతుందనుకున్నాను. తరువాత స్నేహితులతో ఆనందంగా గడుపుతానన్న ఆశ ఉండేది. కాని ఉద్యోగం ప్రారంభమైన తర్వాత వాస్తవం ఎలాంటి వార్నింగ్ లేకుండానే ముఖాన్ని చూపింది అంటూ గౌరవ్ తన బాధను తెలియజేశాడు. వారానికి 60 గంటల పని, అలసట, ఒత్తిడి అన్నీ కలిసిపోయి ఒక తల్లడిల్లే అనుభూతిని కలిగించాయంటూ వివరించాడు.గత ఏడాది కాలంలో ఎక్కువ సమయం ఆఫీసులోనే గడిచిందని గౌరవ్ చెప్పాడు.(USA jobs)

USA jobs : అమెరికాలో చదువు తర్వాత ఉద్యోగంలో చేదు అనుభవాలు
USA jobs : అమెరికాలో చదువు తర్వాత ఉద్యోగంలో చేదు అనుభవాలు

ఉదయం 3 గంటలకే లేచి విధుల్లోకి వెళ్లాడట.95 శాతం వారాంతాలు నేను డ్యూటీలోనే గడిపాను. సెలవు దొరికినా ఇంట్లో నిద్రపోవడమే తప్ప బయటకు వెళ్లాలన్న ఉత్సాహం కూడా లేకుండాపోయింది, అని అతడు వాపోయాడు.తన జీవితం కాలేజీలోనే ఆగిపోయిందేమో అన్న అనుమానం కూడా గౌరవ్‌కి కలిగిందట. కొత్త నగరంలో స్నేహితులు చేసుకోవడం అంత ఈజీ కాదని, ఒక్కసారి కాలేజీ బయటకి వచ్చాక ఆ అనుభూతులు మిగలడం కష్టమని గుర్తించాడు. స్నేహితులు, కుటుంబం వేల మైళ్ల దూరంలో ఉండగా, వారితో మాట్లాడేందుకు మాత్రమే రోజులో కొద్దిసేపు సమయం దొరికేది, అంటూ చెప్పుకొచ్చాడు.ఇంతటి కష్టాల్ని చెప్పిన గౌరవ్, ఇది ఫిర్యాదు కాదు అని స్పష్టం చేశాడు. ఇది ఒక నిజమైన అనుభవాన్ని పంచుకోవడమే. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒంటరిగా అనిపించుకోకండి.

మీలాంటి వారు చాలా మంది ఉన్నారు.సర్దుకుపోవడానికి కొంత సమయం పడుతుంది, అది సహజం, అంటూ యువతకి ధైర్యం చెప్పాడు.అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అనేక మంది భారతీయులు బయట చూపించే మెరుపుల వెనుక ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ వాటిని బయటపెట్టే వారు తక్కువ. గౌరవ్‌కి మాత్రమే కాదు, వాస్తవానికి ఎన్నో యువతకు అమెరికా జీవితం ఈవిధంగానే ఎదురవుతోంది. కష్టాలకు ఎదుర్కొని ముందుకు సాగాలన్న నమ్మకమే గెలుపుని ఇస్తుందని గౌరవ్ తన జీవితానుభవం ద్వారా తెలియజేశాడు.లింక్డ్ఇన్‌లో గౌరవ్ రాసిన పోస్ట్ ఇప్పటికే వేల మందికి చేరింది.

చాలామంది యువత అతని పోస్ట్‌పై స్పందిస్తూ తమ అనుభవాల్ని కూడా పంచుకున్నారు. వీసా వస్తే జీవితం సులభంగా సాగుతుందన్న ఆశలు, అక్కడి వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో చాలా మంది ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ఇక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలు అమెరికాలో ఉన్నారు, అక్కడ డాలర్లలో సంపాదిస్తున్నారని భావించి హాయిగా ఉంటారని అనుకోవద్దు. వాళ్లు కూడా ఒత్తిడితో బాధపడుతూ, ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. అందుకే వాళ్లతో తరచూ మాట్లాడుతూ, ధైర్యం చెప్పడం చాలా అవసరం.గౌరవ్ పోస్ట్ ఒక్కటే కాదు, అనేక మంది భారత విద్యార్థుల మౌనంగా ఉండిపోయే అనుభవాల స్వరం అది. అమెరికాలో ఉన్నత చదువు, ఉద్యోగం అన్నది లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది నిజమైన దిక్సూచి కావచ్చు. కలలు కంటూ వెళ్లిన ప్రదేశంలో నిస్సహాయతతో ఉండడం కష్టం. కానీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడితే, విజయం కూడా దాదాపు ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *