click here for more news about Sandeep Reddy Vanga
Reporter: Divya Vani | localandhra.news
Sandeep Reddy Vanga రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ ప్రస్తుతం ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. దీపిక పదుకొణెను హీరోయిన్‌గా తీస్తామని మొదట ప్రకటించిన దర్శకుడు, చివరకు ఆమెను చిత్ర ప్రాజెక్ట్ నుండి తప్పించారు. కానీ దీని వెనుక అసలు కథ ఇప్పుడు బహిరంగంగా వెలుగు చూస్తోంది.ఈ ప్రాజెక్ట్‌లో తొలుత దీపిక పదుకొణెను లీడ్ హీరోయిన్‌గా తీసుకోవాలని సందీప్ రెడ్డి అనుకున్నారు.అయితే, ఆమె కొన్ని ప్రత్యేక షరతులు పెట్టడంతో, దర్శకుడు వెనక్కి తగ్గాడు. తాజా సమాచారం ప్రకారం, దీపిక స్థానాన్ని యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ భర్తీ చేయనుంది.త్రిప్తి ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

కానీ దీపిక తప్పుకోవడం వెనుక ఉన్న కారణాలు మాత్రం ప్రస్తుతం వివాదాలకు దారితీస్తున్నాయి.త్రిప్తి డిమ్రీ ఎంపికైన తర్వాత, ‘స్పిరిట్’ సినిమా కథకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు మీడియాకు లీకయ్యాయి.ఈ లీక్ వెనుక దీపిక పీఆర్ టీమ్ ఉండొచ్చని టాక్ బలంగా వినిపిస్తోంది.దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి వంగా, సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అంటూ ట్విట్టర్ (ప్రస్తుత ‘ఎక్స్’) లో స్పందిస్తూ, తాను ఎదురొడ్డి నిలబడతానని స్పష్టం చేశారు.సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీరు కథ లీక్ చేసినా నాకు నష్టం లేదు. కానీ ఇది నీచ పీఆర్ ఆట. మీ ఫెమినిజం ఇదేనా? అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.ఈ మాటలతో ఆయన అనేకమంది నెటిజన్ల మద్దతు పొందారు.
అయితే కొంతమంది మాత్రం ఈ మాటలపై విమర్శలు కూడా చేస్తున్నారు.నేను ఓ నటికి కథ చెప్పినప్పుడు, పూర్తిగా నమ్మకంతో చెబుతాను.మా మధ్య N.D.A (నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్) ఉంటుంది. అయినా మీరు లీక్ చేయడం వల్ల మీవారే బయటపడిపోతున్నారు.ఒక యువ నటిని వదిలించాలన్న ఉద్దేశంతో, ఆమెను విమర్శిస్తూ కథను లీక్ చేయడం సరైన పని కాదు. ఇది ఫెమినిజం కాదని చెబుతున్నా. నాకు సినిమా దేవుడితో సమానం.
దీనికోసం సంవత్సరాల పాటు కష్టపడతాను.మీరు మొత్తం కథను బయట పెట్టినా నాకు పోయేదేం లేదు.ఎందుకంటే, నా పని నిజాయతీగా జరుగుతోంది. #DirtyPRGames.ఈ ట్వీట్ చివర్లో ఆయన హిందీలో ఒక డైలాగ్ కూడా జోడించారు. ఇది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.దీపిక పదుకొణె తరపున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఆమె పీఆర్ టీం నుంచే కథ లీక్ అయిందన్న ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీపిక గతంలో కూడా కొన్ని ప్రాజెక్టుల్లో పీఆర్ సమస్యలతో వార్తల్లోకి వచ్చారు.‘స్పిరిట్’ సినిమాలో నటించేందుకు త్రిప్తి డిమ్రీ ఎంపిక కావడం, ఆమె కెరీర్‌కు కొత్త మలుపు తిప్పబోతోందని అంటున్నారు.
‘బుల్బుల్’, ‘కాళీ కూచి’, ‘యానిమల్’ వంటి సినిమాల్లో ఆకట్టుకున్న త్రిప్తి, ప్రభాస్ సరసన నటించనుండడం వల్ల ఆమెకి దేశవ్యాప్త గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.సందీప్ రెడ్డి వంగా ముందుగానే అటు పబ్లిసిటీ, ఇటు కథాపై కంట్రోల్ కోల్పోకుండా ముందుగానే ‘ప్రీ-డామేజ్ కంట్రోల్’ స్ట్రాటజీ తీసుకున్నట్టుగా నిపుణులు అంటున్నారు. తన దైన శైలిలో ట్వీట్లు చేస్తూ, ఒకవేళ కథ బయటకు వెళ్లినా దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపించారు.ఈ వివాదం కొంతకాలం మీడియా స్పాట్‌లైట్‌ను ఆకర్షించినా, సినిమాపై దీర్ఘకాల ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే మూవీపై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. త్రిప్తి ఎంపిక నేపథ్యంలో కొత్త ఎనర్జీ వచ్చిందని అభిమానులు చెబుతున్నారు.ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభంపై స్పష్టత రాలేదు.