RGV : వెళ్లి మోదీకి చెప్పు అన్నాడు… ఆమె చెప్పింది: వర్మ

RGV : వెళ్లి మోదీకి చెప్పు అన్నాడు... ఆమె చెప్పింది: వర్మ

click here for more news about RGV

Reporter: Divya Vani | localandhra.news

RGV జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణ ఘటనలో 26 మంది నిరాయుధ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది సర్వసాధారణ ప్రజానీకాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అయితే, దీనిపై భారత్ మౌనంగా ఉండలేదు. ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో భారత సాయుధ బలగాలు ఉగ్ర మూకలపై చెలరేగిపోయాయి.ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) తో పాటు పాకిస్థాన్ లోని కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయి. మొత్తం తొమ్మిది ప్రధాన ఉగ్ర కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

RGV : వెళ్లి మోదీకి చెప్పు అన్నాడు... ఆమె చెప్పింది: వర్మ
RGV : వెళ్లి మోదీకి చెప్పు అన్నాడు… ఆమె చెప్పింది: వర్మ

ఉగ్రవాదుల ఉనికి కుదేలవడం, వాటి మద్దతుదారులపై గట్టి హెచ్చరికగా ఈ చర్య నిలిచింది.భారత సైన్యం చేసిన ఈ సాహసోపేత చర్యకు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది.సామాన్య ప్రజలు మాత్రమే కాదు, రాజకీయనాయకులు, సినిమా నటులు, క్రీడా ప్రముఖులు కూడా భారత జవాన్ల ధైర్యాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో తమ భావాలు పంచుకున్నారు.టాలీవుడ్‌ హీరోలైన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు సైనికులపై గర్వాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు షేర్ చేశారు. “భారత సైన్యం దేశ గౌరవాన్ని కాపాడుతోంది అంటూ స్పందించారు.ప్రఖ్యాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందిస్తూ సెటైరికల్ కామెంట్ చేశారు. పహల్గామ్ దాడిలో ఓ మహిళ భర్తను చంపిన ఉగ్రవాదులు, వెళ్లి మోదీకి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగా మోదీకి చెప్పింది అంటూ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనలన్నీ భారత ప్రజలలో దేశభక్తిని మరింత గట్టిగా రేకెత్తించాయి. సైన్యం సాహసం చూసి ప్రతి ఒక్కరూ గర్వించారు. ఉగ్రవాదం ఎదుర్కొనే విషయంలో భారత్ ఎలా మారిందో ఈ ఆపరేషన్ చూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *